పెళ్లి తర్వాత మీడియా ముందుకొచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్

Published on July 17, 2024 by Focusway Team
పెళ్లి తర్వాత మీడియా ముందుకొచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్

వివాహానంతరం వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్తతో కలిసి మొదటిసారి మీడియా ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి. నా హస్బెండ్ తో కలిసి ఫస్ట్ టైం మీతో మీట్ కావడం చాలా ఆనందంగా వుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇంకా చాలా సినిమాలు చేస్తాను. నన్ను మీ ఫ్యామిలీగా యాక్సప్ట్ చేసినందుకు థాంక్ యూ’ అన్నారు.

‘హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్. మీరంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి’ అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్.

వరలక్ష్మి భర్త నికోలై సచ్‌దేవ్‌ మాట్లాడుతూ.. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా వుంది. మై వైఫ్ అమేజింగ్ యాక్ట్రెస్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తనని మ్యారేజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరంతా తనని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఒక ఫ్యామిలీ లా చూసుకున్నారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి. థాంక్ యూ ఆల్’ అన్నారు.