బాహుబలి, RRR వంటి పాన్ ఇండియా చిత్రాల ప్రముఖ దర్శకుడు రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
దీనికి సంబందించిన ఒక ప్రోమో వీడియోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో రాజమౌళి తీసిన ప్రముఖ చిత్రాల్లోని షూటింగ్ సన్నివేశాలు, రాజమౌళి హీరోలను డైరెక్ట్ చేసే సీన్స్ మరియు రాజమౌళి సెట్లో ఎలా ఉంటారనేది చూపించారు. అంతేకాక టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళి గురించి వారి అభిప్రాయాలను తెలియజేసారు.
మోడరన్ మాస్టర్స్(Modern Masters) పేరుతో వచ్చిన ఈ డాక్యుమెంటరీని తెలుగు, తమిళ్, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకులు వీక్షించవచ్చు.
ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.