‘సరిపోదా శనివారం’ కొత్త పోస్టర్: పవర్ ప్యాక్డ్ లుక్ లో అదరగొడుతున్న నాని

'సరిపోదా శనివారం' కొత్త పోస్టర్: పవర్ ప్యాక్డ్ లుక్ లో అదరగొడుతున్న నాని

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’.

రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా సరిపోదా శనివారం టీం ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నాని పవర్ ప్యాక్డ్ లుక్ లో అదరగొట్టారు. రగ్గడ్ లో లుక్ లో చేతిలో వెపన్ పట్టుకుని పవర్ ఫుల్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. మూవీలో హైఆక్టేవ్ యాక్షన్ వుండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది.

'సరిపోదా శనివారం' కొత్త పోస్టర్: పవర్ ప్యాక్డ్ లుక్ లో అదరగొడుతున్న నాని

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఆగస్ట్ 29, 2024న విడుదల కానుంది