ప్రస్తుతం దేశం లో పాన్ ఇండియా సినిమాల హవా నడుతోంది. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ చిత్రం కల్కి 2898 ఎడి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
ప్రస్తుతం డైనమిక్ హీరో విష్ణు మంచు హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది.
సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి చర్చ జరుగుతోంది. కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే కన్నప్ప వాడిన విల్లు విశేషాలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకి సంబందించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది.
మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల విడుదల కానుంది.
Actress Mrunal Thakur, who has gained popularity for her roles in Sita Ramam and Hi…
With the Telangana state government's special approval, the eagerly anticipated period action movie Hari Hara…
After a rigorous 250-day shoot that lasted more than three years, the much awaited Kantara…
Ram Charan is ready to silence his critics and emerge stronger with Peddi, a rustic…
In the seductive second single, "Monica," from Superstar Rajinikanth's upcoming Pan-India action entertainer "Coolie," which…
The biggest Tamil film of the year is without a doubt 'Coolie', the highly anticipated…