టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల మధ్య అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మధ్యకాలంలో అగ్ర దర్శకుల్లో ఒకరైన సందీప్ రెడ్డి వంగ తన ఆఫీస్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఛాలెంజ్’ చిత్రంలోని భారీ ఫోటో ఫ్రేమ్ పెట్టించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో అప్పట్లో వైరల్ అయ్యింది.
అయితే, తాజాగా RC16 డైరెక్టర్ బుచ్చిబాబు సన సందీప్ రెడ్డి వంగ ఆఫీసుకు వెళ్లినప్పుడు, ఆ ఫోటో ముందు నిల్చొని పోజిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
“ఫొటోలు తీయడం ఆపి సినిమా స్టార్ట్ చేయండి!” అని ఒకరు,
“RC 18 – సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్?” అంటూ మరొకరు,
“డిన్నర్ ప్లాన్ ఎక్కడ?” అంటూ ఇంకొకరు సరదాగా ట్రోల్స్ చేస్తున్నారు.
సినిమా ప్రాజెక్టుల మధ్యన టాప్ డైరెక్టర్ల కలయికలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. మరి, ఈ ఇద్దరూ కలిసి భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారా? అనేది చూడాలి!
A breathtaking new artistic tribute to RRR stars Ram Charan and Jr. NTR has taken…
Global Star Ram Charan is set to mesmerize audiences with his much-anticipated 16th film, PEDDI,…
Ram Charan is all set to captivate audiences with his highly anticipated 16th film, collaborating…
Bollywood and South Indian film sensation Tamannaah Bhatia made heads turn as she arrived in…
The highly anticipated period action drama Hari Hara Veera Mallu, starring Power Star Pawan Kalyan,…
Lakshmi Manchu shared an emotional tribute to her father, veteran actor Mohan Babu, on his…