అందాల తార అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పరదా. ఈ చిత్రంలో వెర్సటైల్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
‘సినిమా బండి’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రం ‘పరదా’ ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ రత్నమ్మ గా సంగీత క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హోమ్లీగా కనిపించిన సంగీత ఫస్ట్ లుక్ ఆకట్టుకుంతొంది.
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది.
శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.