‘రాయన్’ ట్రైలర్: ధనుష్ క్యారెక్టర్ గూస్ బంప్స్

సూపర్ స్టార్ ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీకి తనే దర్శకత్వం వహిస్తున్నారు.

‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పధకం వేసి సింహన్ని ఓడిస్తాయి” అనే పవర్ ఫుల్ వాయిస్ ఇంట్రోతో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయింది.

RAAYAN - Official Trailer Telugu | Dhanush | Sun Pictures | A.R. Rahman
Raayan Telugu Trailer

‘బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు. దహనం చేస్తాడు’ అంటూ ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించింది. ధనుష్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ట్రైలర్ లో సందీప్ కిషన్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగా వుంది. ఎస్ జే SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ఇంపార్ట్టెంట్ రోల్స్ లో కనిపించారు.

ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. ఓం ప్రకాష్ విజువల్స్, ప్రసన్న జికె ఎడిటింగ్, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.

రాయన్ జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.