మాస్ క దాస్ విశ్వక్ సేన్ తన కొత్త చిత్రంలో ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు.
అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మెకానిక్ రాకీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని బాడ్ యాస్ అవతార్‌లో కనిపించారు. మెకానిక్‌గా తన క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తూ, పోస్టర్లో ఓల్డ్ కార్స్ కూడా వున్నాయి.
కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.