హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం ఆపరేషన్ రావణ్’. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
‘ఆపరేషన్ రావణ్’ సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సులోని హీరో రక్షిత్ అట్లూరి స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
‘ఆపరేషన్ రావణ్’ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.