పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ఎంత పెద్ద హిట్ అయ్యిందో  అందరికి తెలిసిందే.

ప్రస్తుతం కల్కి 2898 AD యూనిట్ మొత్తం ఈ భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.  ప్రభాస్ అభిమానులు దాని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్ సలార్ పార్ట్ 2 ని పూర్తి చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గత సంవత్సరంలో వచ్చిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

సలార్ పార్ట్ 2 ఆగష్టు 10, 2024 నుండి ప్రారంభిస్తారని వార్తలొస్తున్నాయి.  కానీ  అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 

సలార్ పార్ట్ 1 లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. పృథ్వి రాజ్, జగపతి ప్రధాన పాత్రల్లో నటించారు. 

అయితే సలార్ పార్ట్ 2 కల్కి రికార్డులని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.