నజ్రియా నసీమ్ మలయాళం మరియు తమిళ భాషలలో నటించిన ప్రముఖ నటి. బాలనటిగా  కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జన్మించింది.

1994 డిసెంబర్ 20న  జన్మించిన నటి నజ్రియాకు ప్రస్తుతం 29 ఏళ్లు.  2006లో విడుదలైన మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.

నజ్రియా 2005లో  టెలివిజన్ క్విజ్ షోలో యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది, అనేక యాంకరింగ్ షోలు చేసింది.

నజ్రియా 2013లో మలయాళం మరియు తమిళం రెండు భాషల్లో విడుదలైన నేరమ్ చిత్రంతో తొలిసారిగా నటించింది.

నజ్రియా తమిళంలో ఆర్య సరసన నటించిన "రాజా రాణి", "నయ్యాందీ" మరియు "షట్ అప్" చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. 

నజ్రియా 2014 లో వరుసగా 5 సినిమాలు చేసింది.  2016లో విడుదలైన “తిరుమనం ఎన్నుమ్ నిక్క” అనే తమిళ సినిమాలో నటించింది. 

2014లో ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. 

నాని సరసన తెలుగు చిత్రం అంటే సుందరానికి లో నటించి  తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.  ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రంలో నటిస్తోంది.